లంబాడీల గుడిసెలను కూల్చివేయడం దారుణం

నవతెలంగాణ జన్నారం
మండలంలోని దేవునిగూడెం గ్రామపంచాయతీ ఫరిధిలో గల గడ్డంగూడలో తరతరతరాలుగా నివాసం ఉంటూ అక్కడే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న మా లంబాడా గిరిజనుల గుడిసెలను కూల్చివేయడం దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లంబాడ హక్కుల జాగృతి సమితి నాయకులు అన్నారు. మంగళవారం తెల్లవారుజామున అటవీ అధికారులు సుమారు 2గంటల ప్రాంతం లొ ఒక్కసారిగా దాడి చేసి నిద్రిస్తున్న సమయంలో జేసీబీలు, ట్రాక్టర్ లు పెట్టి చిన్న పిల్లలు ముసలి వాళ్ళు, మహిళలు అని ఏమి చూడకుండా విధ్వంసం సృష్టించి ఇండ్లను కులగొట్టినారన్నారు . బుధవారం మండల లంబాడి హక్కుల జాగృతి సమితి, సేవాలాల్ ఉత్సవ కమిటీ వివిధ అనుబంధ సంఘాలు కలిసి అయొక్క ప్రాంతానికి సందర్శించి వారికి సానుభూతి ప్రకటించారు. అటవీ అధికారుల చేసిన ఈయొక్క చర్యను పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. గత 25 సవంత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటు పోడు వ్యవసాయం చేసుకుంటున్న మా లంబాడా గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల చర్యలను మానుకోవాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అక్కడే పునరావాసం ఏర్పాటు చేసుకొని 2005కంటే ముందు నుండి సాగు చేసుకుంటున్న మా వాళ్ళను సర్వే చేసి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. కార్యక్రమంలో నాయకులు సంతోష్ రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుపతి, బిమ్లాల్ రాజన్న నందు నాయక్. భరత్ నాయక్, రాజు నాయక్ శ్రీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love