– మంత్రి సింగిరెడ్డినిరంజన్‌రెడ్డి
– జూన్ 2 నుంచి 22 వరకు తెలంగాణ దశాబ్దీ ఉత్సవాలు
ధరూర్ : ప్రతిఒక్కరూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కావాలని, రేపటి తరాలకు స్ఫూర్తి నింపడానికి తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్దీ ఉత్సవాలు నిర్వహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గద్వాల సమీపంలోని సిఎన్జి ఫంక్షన్ హాల్లో తెలంగాణ దశాబ్దీ ఉత్సవాల ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల లో తెలంగాణలోని వివిధ రంగాలలో సాధించిన అభివృద్ధిని తెలుపుతూ ప్రతి శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణ గత తొమ్మిది సంవత్సరాలలో సాధిం చిన ప్రగతిపై ప్రజలకు వివరించాలని, చర్చ జరిపి ప్రణాళిక బద్ధంగా 21 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జరిగే దశాబ్దీ ఉత్సవాల్లో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు, మహిళలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. జూన్ 3 న జరిగే వ్యవసాయ దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. రైతు దినోత్సవం సందర్భంగా రైతు సమీకరణ, డప్పు, వాయిద్యాల తో ఎడ్లబండ్లపై ర్యాలీగా వెళ్లి జాతీయగీతంతో కార్యక్రామాన్ని మొదలు పెట్టి రైతులకు అర్థమయ్యే విధంగా సందేశం ఉండాలని, రైతులను మాట్లాడించాలని. ఏ రంగంలోనైనా ప్రగతి పూర్వం ఎలా ఉంది.. తెలంగాణ వచ్చాక ఎలా ఉందనే అంశాలపై మాట్లాడాలన్నారు. అన్ని శాఖల అభివృద్ధిపై ఉత్సవాల్లో వివరిం చాలన్నారు. రైతు వేదికలను అందంగా అలంకరించి వ్యవసాయ శాఖ సాధించిన ప్రగతిని రైతులకు వివరించాలని తెలిపారు. వెయ్యి మంది రైతులు హాజరయ్యేల చూడాలన్నారు. బతుకమ్మలతో ఊరేగింపుగా వెళ్లి మత్స్యకారులు చెరువుల దగ్గర కట్ట మైసమ్మ పూజలు నిర్వహించి ఉత్సవాలు జరుపుకోవాలని అక్కడే వేయి మందికి భోజన వసతి కల్పించాలన్నారు. విద్యా దినోత్సవం నిర్వహించా లన్నారు.విద్యార్థులకు తెలంగాణా స్ఫూర్తి అర్థమయ్యేలా వివరిం చాలని, విద్యార్థులచే వక్తుత్వ పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేయాలని పేర్కొన్నారు.చివరి రోజు అమరులకు నివాళులర్పించాలని అన్నారు. జెడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ దశాబ్దీ ఉత్సవాలు తెలంగాణ ప్రజలకు పండుగ వంటిది అన్నారు. మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని తెలిపారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లా డుతూ తెలంగాణ దశాబ్దీ ఉత్సవాలలో రూపొందించిన క్యాలెండర్ ప్రకారం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకొని ఉత్సవాలను నిర్వహిం చాలని సూచించారు. డీఏవో గోవింద నాయక్ రైతు వేదికలను ముస్తాబు చేసి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. వ్యవసాయ అధికారులు వారి ఆధ్వర్యంలో రైతులను ఆహ్వానించి దశాబ్దీ ఉత్సవాలపై వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆవీర్భావానికి ముఖ్య కారకులైన పత్రికా సోదరులు వారి అభిప్రాయం తెలపాలని మంత్రి కోరగా సీనియర్ జర్నలిస్టు ముకుందరావు మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ వచ్చేవరకు విలేఖరులు పాత్రపై వివరించారు. సీఎం కే. చంద్రశేఖర్‌రావు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని విలేకరులకు ఇంటి స్టలాలు ఇవ్వాలని మంత్రిని కోరారు. ఈ సమావేశంలో ఎస్పీ సృజన, ఎమ్మెల్యేలు కృష్ణ మోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం,గ్రంథాలయ చైర్మన్ జంబురామన్ గౌడ్, మా ర్కట్ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్, ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, అదనపు కలెక్టర్ అపూర్వ చౌ హాన్,ఆర్డీవో రాములు, మున్సిపల్ చైర్మన్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, పంచాయతీకార్యదర్శులు, డీఎల్‌పీఓ వెంకట్ రెడ్డి,జిల్లా అధికారులు పాల్గొన్నారు.