
నిజామాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్క్ లో గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా డాక్టర్స్ కాలనీ సభ్యులు కోటేశ్వర రావు,కిషన్ రావు,రాములు,భరణి క్రిష్ణ,శివ,మహేందర్,లక్ష్మణ్ నాయక్,గంగాధర్.రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సాయన్న ,పోలీస్ డిపార్ట్మెంట్ మిత్రులు ,జిమ్ కోచ్ సంపత్,బాక్సింగ్ క్రీడాకారులు ఎస్ బి గార్మెంట్స్ వ్యాపారి శభాస్ మరియు మరికొందరు మిత్రులు పడకంటి రాము ఇంటివద్ద కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువా కప్పి సన్మానించి అభినందించారు. తమ తోటి మిత్రుడికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.