Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు దాహార్తిని తీర్చడమే లక్ష్యం 

ప్రజలకు దాహార్తిని తీర్చడమే లక్ష్యం 

- Advertisement -

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై
పార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచ్ ఏదేళ్ల పూలమ్మ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామానికి కావలసిన అన్ని మౌలిక వసతులను త్వరలో ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తామని ఆ గ్రామ సర్పంచ్ ఎదెళ్ల పూలమ్మ అన్నారు. శనివారం స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు చదివేంద్రాన్ని గ్రామపంచాయతీ వార్డు సభ్యులను కలుపుకొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేసవికాలంలో ఎండలు విపరీతము కొట్టడంతో పాదాచారులకు వివిధ గ్రామాలకు వెళ్లి పనుల నిమిత్తం చూసుకొని తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో పోయే క్రమంలో దాహంతో నా గ్రామ ప్రజలు అల్లాడిపోవద్దు అనే ఉద్దేశంతో పార్వతమ్మ గూడెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

అంతే కాకుండా వివిధ గ్రామాలకు పోయి వచ్చేవారికి మరియు రోడ్డుపై ఇతర గ్రామాలకు వెళ్లే వాహనదారులకు కూడా అవసరం పడే విధంగా ఉంటాదనే ఉద్దేశంతో ఈ రోడ్డుపై ఒక ప్రత్యేకమైన మినరల్ వాటర్ ను ఏర్పాటు చేసి దానికి ఒక వ్యక్తిని కూడా కేటాయించినట్లు తెలిపారు. రోజు రోజుగా వాటిని శుభ్రపరుస్తూ రోజు ఉదయం నెల్లికుదురు గ్రామం నుండి మినరల్ వాటర్ తెప్పించి ఆ కుండలలో పోయించి ఏర్పాటు చేశామని తెలిపారు. మా పై అధికారుల ఆదేశాల మేరకు మరి మాపై ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతోటి గ్రామాన్ని పూర్తిస్థాయిలో అన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తామని తెలిపారు. నెల్లికుదురు నడి మహబూబాబాద్ కి వెళ్లే వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ఉపసర్పంచ్ జలక ఎల్లయ్య వార్డు సభ్యులు మట్ట వెంకటరెడ్డి తోట యాకయ్య సంఘం రవి సులోచన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదెళ్ల యాదవ రెడ్డి మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ జిల్లా మండల గ్రామ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -