హ్యక్‌ గుట్టు విప్పాల్సిందే..!

The hack has to be untied..!– ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు యాపిల్‌ అలర్ట్‌పై ‘అత్యవసర సమావేశం’ ఏర్పాటు చేయాలి
– ఐటీ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌కు సీపీఐ(ఎం) ఎంపి జన్‌ బ్రిట్టాస్‌ లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులకు యాపిల్‌ అలర్ట్‌పై ‘అత్యవసర సమావేశం’ ఏర్పాటు చేయాలని సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జాన్‌ బ్రిట్టాస్‌ కమ్యూనికేషన్స్‌, ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. పలువురు ప్రతిపక్ష నేతలకు యాపిల్‌ నుంచి హెచ్చరికలు అందుతున్న నేపథ్యంలో అత్యవసరంగా ప్యానెల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ పరిస్థితిని తక్కువగా అంచనా వేయలేము. ఎందుకంటే ఇది వ్యక్తిగత డేటా భద్రత గురించి మాత్రమే కాకుండా జాతీయ భద్రతకూ చిక్కులను తెచ్చిపెడుతుంది. ఈ నోటిఫికేషన్‌ పెగాసస్‌ స్పైవేర్‌ కుంభకోణాన్ని గుర్తుచేస్తున్నది. ఇది పాలక వ్యవస్థను విమర్శించే గొంతులను లక్ష్యంగా చేసుకుంది. ఇది మన ప్రజాస్వామ్యానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం” అని బ్రిట్టాస్‌ పేర్కొన్నారు.
”ఈ నేపథ్యంలో పౌరుల ప్రాథమిక హక్కులు ప్రమాదంలో ఉన్నందున స్టాండింగ్‌ కమిటీ, ఈ సమస్యను సమగ్రంగా పరిశీలించడానికి తక్షణమే చర్య తీసుకోవాలి. దర్యాప్తు చేయడం కమిటీ పరిధిలో ఉందని నేను నమ్ముతున్నాను” అని లేఖలో పేర్కొన్నారు.
యాపిల్‌ గుర్తించిన భద్రతా ముప్పు స్వభావం, విశ్వసనీయత, ప్రభుత్వం మద్దతు ఉన్న హ్యాకర్ల ప్రమేయం, వారి ప్రేరణలు, సైబర్‌ భద్రతా చర్యల సమర్ధతను కమిటీ పరిశీలించాలని జాన్‌ బ్రిట్టాస్‌ అన్నారు. దేశంలోని మొబైల్‌ ఫోన్‌ వినియోగదారుల గోప్యత, భద్రతను కాపాడాలని అన్నారు. ”గోప్యతా హక్కు మానవ ఉనికికి పవిత్రమైనది. మానవ గౌరవం, స్వయం ప్రతిపత్తి విడదీయరానివి” అని ఆయన అన్నారు.

Spread the love