నవతెలంగాణ – అశ్వారావుపేట
అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై టీ.యయాతి రాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.మండల పరిధిలోని దురదపాడు శివారు లోగల వాగు నుంచి ఆసుపాక గ్రామానికి రెండు ట్రాక్టర్ల లో ఇసుక తరలిస్తుండగా మార్గం మధ్యలోని మామిళ్లవారిగూడెం జంక్షన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నారు. పట్టుబడి న ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.