వేములవాడలో కూలీ దారణ హత్య..

– స్నేహితులే కొట్టి చంపారా..?
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది, పట్టణంలోని భగవంత నగర్‌లో సిర్రం మహేశ్ (46) అనే వ్యక్తి దారుణ హత్య సంఘటన  చోటు చేసుకుంది. మృతునిది ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంగా గుర్తించిన పోలీసులు.గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడలో కూలీ పని చేస్తూ ఉపాధి పొందుతున్న మహేశ్ రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగిన మత్తులో గొడవ జరిగినట్లుగా స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. స్నేహితులే కొట్టి చంపారా..? లేక ఇతర వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారిస్తామని డి.ఎస్.పి తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Spread the love