
నవతెలంగాణ – పెద్దవంగర
విద్యారంగంపై పాలకుల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తగదని టీపీటీఎఫ్ మండలాధ్యక్షుడు చిక్కాల సతీష్, జిల్లా కార్యదర్శి సోమారపు ఐలయ్య అన్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన టీపీటీఎఫ్ రాష్ట్ర ద్వితీయ విద్యా, వైజ్ఞానిక మహాసభలకు ఆదివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం విద్యలో ప్రైవేటీకరణ బలోపేతం అయ్యే విధంగా ఉందన్నారు. సిలబస్ హేతుబద్దీకరన పేరుతో విద్యలో అశాస్త్రీయ అంశాలను చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు సంబంధించి ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో లో ప్రకటించిన విధంగా విద్యా రంగ హామీలన్నీ త్వరితగతిన అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ధరావత్ దేవేందర్ నాయక్, సురేందర్ కుమార్, చింతల సురేష్, శ్రీనివాస్, ఆంజనేయులు, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.