నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని అయ్యప్ప నిలయంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య శ్రీనివాస్ లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ అధ్వర్యంలో శనివారం ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేసి, ఘనంగా శాలువా పుల మాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినట్టు అధ్యక్షులు గుజరాతి ప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా అయప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ..పట్టన్నంలోని అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని వారు కొనియాడారు. అనంతరం లయన్స్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేధన్ గుజరాతి మాట్లాడుతూ పట్టనంలోనీ ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల పరిశుభ్రత,డ్రైనేజ్ వ్యవస్థ, పచ్చని చెట్ల పెంపకం , పట్టణ సుందరీకరణ లాంటి సమస్యలపై దృష్టి సాధించి అభివృద్ధికి పాటు పడాలని కోరినారు ఇట్టి కార్యక్రమంలో లయన్స్ గ్రీన్ కార్యదర్శి ఆల్జాపూర్ రాజేష్, మాజీ అధ్యక్షులు చెపుర్ గనేష్ సభ్యులు లీడర్ శ్రీనివాస్ , నసీరుద్దీన్, వేణు ,సంతోష్ , సాయివర్మ , కోడె స్వామి , సీనియర్ సిటిజన్ విభాగం అధ్యక్షులు దొండీ నారాయణ్ వర్మ సభ్యులు అల్జపూర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.