నిరుద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకత తోటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది..

– డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్..
నవతెలంగాణ – మునుగోడు
నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడిన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక గత పది సంవత్సరాలుగా  ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ దీనస్థితి లో కాలం వెళ్లదీసిన  నిరుద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకత తోటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది అని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు . గురువారం మండల కేంద్రంలోని స్థానిక అమరవీరుల భవనంలో ఏర్పాటు చేసిన డివైఎఫ్ఐ మునుగోడు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా  వెంటనే ఉద్యోగుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు . రాష్ట్రంలో అన్ని శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని కోరారు. ఉద్యోగాల అర్హత వయసును పెంచాలని ప్రభుత్వానికి సూచించారు.ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి, డివైఎఫ్ఐ నాయకులు , పగిళ్ల మదు, చి భిక్షం, సాదిక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love