నూతన ప్రభుత్వానికి ఉద్యోగుల సహకారం ఉంటుంది…

– తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాబర్ట్  బ్రుస్
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి గా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి  కి అభినందనలు తెలియజేస్తున్నామని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాబర్ట్ బ్రూస్, రాష్ట్ర కార్యదర్శి జె. అశోక్ తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాబర్ట్ బ్రూస్ మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖ  ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా పరిష్కరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి యూనియన్ల సహకారం  ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Spread the love