కోర్టు ప్రాంగణంలో వ్యక్తి హంగామా..

నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన కేతావత్ రెడ్యా నాయక్ జిల్లాకోర్టు ప్రాంగణంలో గురువారం హంగామా సృష్టించాడు.గొంతుపైన గాయాలు చేసుకుని, ఒక వాటర్ బాటిల్ లో పెట్రోల్ కలర్ బాటిల్ ను కోర్టు భద్రతా సిబ్బందికి చూపిస్తు దగ్గరకు వస్తే పెట్రోల్ మీద పోస్తనంటు బెదిరించి కోర్టు మొదటి అంతస్థులోని నిజామాబాద్ రెండవ అదనపు జ్యూడిషియల్ ఫస్టుక్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కారిడార్ లో కలియ తిరిగి న్యాయం కావాలంటు,నవిపేట్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ హింసిస్తున్నారంటూ గట్టిగా అరవడంపై నుండి దూకదానికి ప్రయతించడంతో కోర్టు సిబ్బంది నచ్చజెప్పి భద్రతా సిబ్బంది కి అప్పజెప్పారు. జిల్లాకోర్టు లైజనింగ్ అపీసర్ శ్యామ్ కుమార్ నిజామాబాద్ ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి, 108 సిబ్బందికి ఫోన్ చేసి రప్పించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపజేశారు.
ఇతడు పాత నేరస్థుడు.. రెడ్యా నాయక్ పై పలు పోలీస్ స్టెషన్లలో దొంగతనం కేసులు ఉండేవి. బైక్ దొంగతనాలు, గుడిలో దొంగతనం కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉండి పరిష్కారం అయినవి. కొస మెరుపు ఏమిటంటే అతను తెచ్చుకున్న బాటిల్ ను చూడగా రంగు కలిపిన నీళ్ల బాటిల్ గా ఉన్నది.
Spread the love