సత్వరమే విచారణ చేపట్టి మాకు న్యాయం చేయాలి: పోస్టల్ బాధితులు

– జిల్లా పోస్టల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి బాధితులు కలిసి వినతి పత్రం అందజేత
– జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసిన పోస్టల్ బాధితులు
– నెల గడుస్తున్నా ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన
– డబ్బులు పోగొట్టుకుని మానసికంగా కుంగిపోతున్నామని బాధితుల ఆవేదన
 నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ పైలాన్ పవర్ హౌస్ పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్,ఫీక్సుడ్, రికరింగ్ డిపాజిట్లు సేవ్ చేసుకున్న నగదును సబ్ పోస్ట్ మాస్టర్ రామకృష్ణ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారుల నగదును మాయం చేయడంపై సత్వరమే విచారణ చేపట్టి తమకు నగదును ఇప్పించాలని  కోరుతూ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ చందన దీప్తి కి వినతి పత్రాన్ని, జిల్లా పోస్టల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డిని జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో బాధితులు మంగళవారం కలసి తమకు న్యాయం చేయాలని కోరారు .నగదు మాయమైన విషయంపై పోస్టల్ అధికారులు విచారణ చేపట్టి నెలరోజులు గడుస్తున్న పోస్టల్ ఖాతాదారులకు అధికారుల నుండి ఎటువంటి హామీ లభించకపోవడంతో డబ్బులు పోగొట్టుకుని మానసికంగా కుంగిపోతున్నామని తమకు పూర్తిగా భరోసాను కల్పిస్తూ నగదును తిరిగి ఇవ్వాలని కోరారు. పోస్టల్ ఖాతాలలో సుమారు రెండు కోట్ల వరకు నగదును బాధితులు కోల్పోయారని, దానిపై సత్వరమే విచారణ చేయడానికి పోస్టల్ అధికారులు ఎక్కువ మొత్తంలో సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా, దీనికి బాధ్యులైన దిగువ, ఎగువ స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా పోస్టల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి స్పందిస్తూ బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా విచారణ చేపట్టి నగదును పూర్తిస్థాయిలో అందజేస్తామని హామీ ఇచ్చారు.వినతిపత్రం అందజేసిన పోస్టర్ బాధితులలో సంపూర్ణమ్మ,మల్లేశ్వరి, చెన్నయ్య,శివ, హనుమంతు, తదితరులు ఉన్నారు.
Spread the love