మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– కుమ్మరికుంట నాగన్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
నవతెలంగాణ-మహబూబాబాద్‌
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న డిమాండ్‌ చేశారు. నిరవధిక సమ్మె శనివారం మూడో రోజుకు చేరింది. మూడో రోజు నిరవధిక సమ్మెను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరికుంట్ల నాగన్న ప్రారంభించి మాట్లాడుతూ సీఐటీయూ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా జీవో ఎంఎస్‌ నెంబర్‌ 8 విడుదల చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2022 మార్చ్‌ 15న మధ్యాహ్న భోజన పథకం కార్మి కులకు ప్రస్తుతం పొందుతున్న జీతంపై అదనంగా 2000 రూపాయలు పెంచు తున్నట్లు ప్రకటించారని అన్నారు. ప్రకటించి 19 నెలలవుతున్న కార్మికులకు పెం చిన జీతం ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. పెండింగ్‌ బిల్లులు నెలల తరబడి రాకపోవడంతో అప్పులు చేసి వంట చేసిన పెండింగ్‌ బిల్లులు విడుదల కాకపోవడంతో కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దు య్యబట్టారు. కొత్త మెనూ ప్రకారం మిక్స్డ్‌ వెజిటేబుల్‌ కర్రీ వెజిటేబుల్‌ బిర్యాని వా రానికి మూడు కోడిగుడ్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అదనంగా బ డ్జెట్‌ కేటాయించకుండా కొత్త మెనూ ప్రకారం పెట్టడం సాధ్యం కాదని అన్నారు. పాత మెను ప్రకారం కొనసాగించాలని పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని పెంచిన 2000 రూపాయలు 19 నెలల బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చే శారు. లేనివెడల పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వేముల రుజన్య, రాధిక, రాణి,మమత,లలిత,అరుణ, సుగుణమ్మ, పద్మ, రమ పాల్గొన్నారు.

Spread the love