
నవతెలంగాణ – మల్హర్ రావు
సమాజంలో మహిళల పాత్ర గొప్పదని ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు.శుక్రవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొగుళ్ళపల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శిని శాలువాతో ఘనంగా సన్మానించి,మెమోంటో అందజేశారు.ఈ సందర్భంగా ఆర్టీఐ కార్యకర్త మాట్లాడారు మహిళలు విద్య,ఆర్థికంగా,రాజకీయంగా ఏదగలన్నారు.మహిళలు ఎందులో తక్కువ కాదని,అన్నిట్లో సమానంగా దూసుకుపోతున్నారన్నారు.రాజకీయ రిజర్వేషన్లలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం రిజర్వేషన్లు చేశామన్నారు.ఆలాగే మహిళల కోసం అనేక చట్టాలు సైతం తెచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజేందర్ రెడ్డి వీరారెడ్డి,రాశి రెడ్డి,డీలర్ బద్రయ్య,అంగన్ టీచర్ సుజాత,దేవేంద్ర,ఆశ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.