బెట్టింగుల జోరు..యువత పక్కదారి

– అంతా స్మార్ట్ ఫోన్లలోనే..
నవతెలంగాణ – మాక్లూర్ 
క్రికెట్ సీజన్ ప్రారంభమైననాటి నుంచి గ్రామీణ ప్రాంతాలలో ఆన్లైన్ బెట్టింగులు ఉపందుకున్నాయి. ప్రత్యేకించి యువకులు సంబంధిత యాప్ లను డౌన్లోడ్ చేసుకొని పందేలు కాస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇంటి నుంచే బెట్టింగులు జరుపుతున్నారు. చేతిలో ఫోన్, అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు పల్లె, పట్నం అన్న తేడా లేకుండా కొనసాగుతుంది. ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభంతో ఎవరు ఎంత బెట్ కాస్తునారొన్నాని పొన్లు ప్రారంభమవుతాయి. తర్వాత పోటీ పడుతున్న రెండు జట్ల బలాబలాల ప్రకారం బెట్టింగ్ ఉంటుంది. బలమైన జట్టుతో బలహీనమైన జట్టు పోటీలో ఉంటే బలహీనమైన జట్టు గెలుస్తుందని బెట్టింగ్ కాస్తే ఒకటికి రెండు రెట్ల డబ్బులు చెల్లిస్తారు. ఓవర్ ఓవర్ కు, బాల్ బాల్ కు కూడా బెట్టింగ్ పెట్టుకుంటారు. బంతిని సిక్స్ కొడతాడా ? ఫోర్ కొడతాడా? వికెట్ పడుతుందా? అనే అంశాలపై బెట్టింగ్ కొనసాగుతుంది.  స్మార్ట్ ఫోన్లలోనే  డబ్బులు చెలింపులు జరుగుతాయి. బెట్టింగ్ వ్యవహారాల్లో యువకులు పక్కదారి పడుతూ తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్నారు. తల్లిదండ్రులు మేల్కొని తమ పిల్లలు బెట్టింగుకు పాల్పడకుండా జాగ్రత్త పడాలి. అధికారులు సైతం నిఘా ఉంచి నిర్వహించే వారి పై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తల్లిదండ్రులు నిఘా పెట్టాలి…
స్మార్ట్ ఫోన్  ద్వారా ఆన్లైన్ రమ్మీ, క్రికెట్ బెట్టింగ్, ప్రత్యేక యాప్ లలో బెట్టింగ్ ఆడుతున్నారు. పిల్లలపై నిత్యం తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. ప్రతి గ్రామంలో అవగాహన కల్పించాలి.
Spread the love