Sunday, April 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరేపు రెండో విడత రైతు భరోసా

రేపు రెండో విడత రైతు భరోసా

- Advertisement -

కాటారం సభలో నిధులు విడుదల చేయనున్న సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ఈ విడతలో 45,11,947 మంది రైతులకు ఎకరాకు రూ. ఆరు వేల చొప్పున పంట సాయం అందనుంది. రాష్ట్రంలో మొత్తం 1.50కోట్ల ఎకరాలు సాగుభూమి ఉండగా 73లక్షల మంది రైతులకు రైతు భరోసా అమలవుతుంది. మార్చి 23న రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత రైతు భరోసా సాయం కింద 3,590కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది. రెండో విడతలో రూ.5,653 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. మూడో విడత నిధులను వీలైనంత త్వరగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -