కేంద్రమంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. శనివారంనాడాయన ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లోని పారిశ్రామిక ప్రతిపాదనలను వారికి వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేస్తామనీ, దానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
బయ్యారంలో గ్రీన్ స్టీల్‌ప్లాంట్ నెలకొల్పండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



