సాయి యాదాద్రి సేవా సంస్థ సేవలు మరువలేనివి : వరమ్మవెంకటయ్య

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
సాయి యాదాద్రి సేవా సంస్థ సేవలు మరువలేనివని స్థానిక కౌన్సిలర్ ఉబ్బు వరమ్మవెంకటయ్య అన్నారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో గల తంగడపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు గాద నరసింహ-కమలమ్మ చిన్న కుమారుడు గాదె బాబురావు రామోజీ ఫిలిం సిటీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. పని ముగించుకుని ఫిలిం సిటీ ముందు రోడ్డు దాటుతుండగా వెనకనుంచి లారీ వచ్చి ఢీ కొట్టింది. దానితో రెండు చేతులు ఎడమ కాలు విరిగింది. కార్పొరేట్ ఆసుపత్రిలో లక్షలు దార పోసి వైద్యం చేయించారు. ప్రాణాపాయానికి ఎటువంటి హాని లేదు.కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా సాయి యాదాద్రి సేవా సంస్థ అధ్యక్షులు దబ్బేటి అశోక్ కు తెలియజేయగా వెంటనే స్పందించి 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులను కౌన్సిలర్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల చేతుల మీదుగా బాధ్యత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉబ్బు వరమ్మవెంకటయ్య మాట్లాడుతూ గతంలో మున్సిపల్ పరిధిలో ఉన్న నిరుపేదలకు ఈ సేవా సంస్థ ద్వారా సేవలందించారని కొనియాడారు. సాయి యాదాద్రి సేవా సంస్థ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సిలివేరు శ్రీనివాస్ రెడ్ క్రాస్ సొసైటీ మండల అధ్యక్షులు ఢిల్లీ శంకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఢిల్లీ మాధవరెడ్డి ఉపాధ్యక్షులు దాసోజు బిక్షమాచారి జిల్లా కార్యవర్గ సభ్యులు మంచికంటి రమేష్ గుప్తా సాయి యాదాద్రి సేవా సంస్థ పెద్ద కొండూరు ఆశ్రమం ప్రధాన కార్యదర్శి జె.వై శెట్టి కార్యదర్శి మహేష్ చినకాని యువరాజు గ్రామస్తులు దాసరి వెంకటేష్,మనోహర్,రాజు,సాయి తదితరులు పాల్గొన్నారు.
Spread the love