రైతులకు ముత్తయ్య అందించిన సేవలు మరువలేనివి…

– సొసైటీ సీఈవో పదవి విరమణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు
నవతెలంగాణ -దుమ్ముగూడెం
ప్రాథమిక సహకార రంగంలో గత 33 ఏళ్ల పాటు అలుపెరగని సేవలందించిన సొసైటీ సీఈవో ఉంగుటూరు ముత్తయ్య సహకార సంఘానికి చేసిన సేవలు అభినందనీయమని పలువురు వక్తలు రాజకీయ ప్రముఖులు రైతులు ప్రశంసించారు. శుక్రవారం దుమ్ముగూడెం సొసైటీ సీఈవో ముత్తయ్య పదవి విరమణ పొందిన సందర్భంగా దుమ్ముగూడెం సొసైటీ కార్యాలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ముత్తయ్యకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ సహకార రంగంలో వివిధ హోదా లలో అంకితభావంతో పనిచేసిన ముత్తయ్య అంచలంచలుగా ఎదిగి సీఈఓ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని గౌరవ మర్యాదలతో పలకరించే వారిని, కర్షకుడు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో రైతుల శ్రేయస్సు కోసం అంకిత భావ విధులను నిర్వహించి అందరి మన్ననలు పొందడం నిజంగా అభినందనీయమని అన్నారు. 1300 మంది సభ్యులతో ప్రారంభమైన సొసైటీ సభ్యత్వాన్ని సుమారు 4500 మందికి పైబడి పెంపొందించి జిల్లాలోనే దుమ్ముగూడెం సొసైటీకు గుర్తింపు తెచ్చిన పాలకవర్గ సభ్యుల కృషిలో ముత్తయ్య పాత్ర కీలకమని అభినందించారు. సుమారు 16 కోట్ల రూపాయల కు పైబడి రుణాలను మాఫీ చేయించి ఈ ప్రాంత రైతుల అభిమానాన్ని చురగొనడంలో ముత్తయ్య పాత్ర కూడా ఉందని చెప్పుకొచ్చారు.ఆది నుంచి వివాదరహితుడుగా పనిచేసిన ముత్తయ్య తన శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో గడపాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కిలిమి ఎల్లారెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్ , బిఆర్ఎస్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నె సత్యాలు, సొసైటీ డైరెక్టర్ బొల్లి వెంకట్రావు, కాల్వ పూర్ణయ్య, కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు లంక అబ్బులు, ఏవీఎస్పీ నాయకులు సోయం కామరాజు, రవి ,రైతులు బొల్లి సత్యనారాయణ, కొడాలి లోకేష్ బాబు, క్రాప పూర్ణచంద్రరావు, మోత్కూరి శ్రీకాంత్ ,దామెర్ల శ్రీనివాస్, కెల్లా శేఖర్, సొసైటీ సిబ్బంది సత్యనారాయణ గంగరాజు ,హిమబిందు, సురేష్, పూర్ణచంద్రరావు, డిసిసిబి బ్యాంకు సిబ్బంది, వివిధ మండలాల సీఈఓ లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love