రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలి

– డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలి అని గ్రామాలలో అనేక మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నాయని వారికి ప్రభుత్వ ప్రోత్సాహం లేక వారి క్రీడా నైపుణ్యాన్ని మరిచిపోయి, ఇతర పనులకు వెళ్తున్నారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకట్ అన్నారు. మండలంలోని అనాజీపురం గ్రామంలో యువజన సర్వే నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ గత పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలలో క్రీడల పట్ల, క్రీడకారుల పట్ల సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల అనేక మంది యువత క్రీడా నైపుణ్యం కలిగి ప్రోత్సహించే వాళ్ళు లేక వారి నైపుణ్యాన్ని మర్చిపోతున్నారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడా మైదానాల పేరుతో స్థలాలను ఏర్పాటు చేసిన అక్కడ క్రీడా సామాగ్రి లేక యువత అనేక ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయిన క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి అని వారు అన్నారు. క్రీడా మైదానాలలో క్రీడా సామాగ్రి, నైపుణ్యం కలిగిన యువతను గుర్తించి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వారికి అవగాహన తీసుకురావాలని వారు అన్నారు. వీరితోపాటు మాజీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లాపురం వెంకటేష్, మండల అధ్యక్షులు బొల్లేపల్లి శ్రీకాంత్, నాయకులు నవీన్, ప్రవీణ్, బోల్లెపల్లి కిషన్, పవన్, నరేష్, తదితరుల పాల్గొన్నారు.

Spread the love