మధ్యాహ్న భోజన కార్మికుల పోట్టగొట్టే చర్యలను విడనాడాలి 

– రాష్ట్ర వ్యాప్తంగా టోకెన్ సమ్మె ప్రారంభం 
– జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ 
నవతెలంగాణ -కంటేశ్వర్
మధ్యాహ్న భోజన కార్మికులను పొట్ట కొట్టే చర్యలను విడనాడాలని రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ సమ ప్రారంభమైందని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నేడు ఎంఈఓ కార్యాలయాల ఎదుట  టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. 2022 మార్చిలో అసెంబ్లీలో వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటి నుండి ఎరియర్స్ తో సహా చెల్లించాలి. కొత్త మెనూకి బడ్జెట్ పెంచాలి. పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని నిజామాబాద్ నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో గల ఎంఈఓ కార్యాలయం  ఎదుట రాష్ట్ర వ్యాప్త టోకెన్ సమ్మె మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ ప్రారంభించారు. జిల్లాలో 8 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని, రెండు కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్తున్నప్పటికీ ఇంకా కార్మికుల ఖాతాల్లోకి చేరలేదని,  9, 10 తరగతి లకు ఐదు నెలల గుడ్ల  బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, బిల్లులు రాకపోయినా గుడ్లు పెట్టాలని, నూతన మెనూ అమలు చేయాలని స్కూల్లో హెడ్మాస్టర్లు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఈ వేధింపులను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు, పెండింగ్ బిల్లులు చెల్లించిన అనంతరమే, గుడ్లు, నూతన మెనూ అమలు చేస్తామని అంతవరకు చేసేది లేదని, బలవంతం చేస్తే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 2022 మార్చి 15న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రూ.3,000/-లు పెంచుతున్నట్లు ప్రకటించారు. కానీ నేటికీ 18 నెలలు అయినప్పటికీ ఇప్పటికీ వేతనాల జీఓ అమలు కావడం లేదు. జీఓఎంఎస్ నెం.8 విడుదల చేసినప్పటికీ ఆ జీఓలో నిర్ధిష్టంగా ఎప్పటి నుండి జీఓ అమలు చేస్తారో స్పష్టత లేదు. కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి నేటి వరకు ఎరియర్స్తో సహా చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న బిల్లులను తక్షణం ఇవ్వాలి, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి, ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలి, కొత్త మెనూకి అదనంగా బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మధ్యాహ్న భోజన నిర్వహణకు పెరుగుతున్న ధరలకనుగుణంగా బడ్జెట్ కేటాయింపులే తక్కువ. అవి కూడా నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో కార్మికులు అప్పులు చేసి వంట చేయడంతో అప్పులపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.రోజు కోడి గుడ్లు పెట్టలేదన్న సాకుతో కార్మికులను వేధిస్తూ తొలగిస్తున్నారు. మరో ప్రక్క గుడ్డు పెట్టడానికి అంగీకరించని స్వచ్ఛంద సంస్థలపై ప్రేమ చూపిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో శేరిలింగంపల్లి, గండిపేట, మొయినాబాద్, రాజేంద్రనగర్ మండలాల్లో 190 పాఠశాలలను అక్షయ పాత్రకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అమలైతే కార్మికులందరూ రోడ్డున పడతారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, గుడ్డుకు అదనంగా బడ్జెట్ను కేటాయించాలని లేదా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలి.జూన్ 20 నుండి కొత్త మెనూ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇప్పుడున్న మెనూకే కేటాయించిన బడ్జెట్ సరిపోవడం లేదు. పైగా కొత్తగా కిచిడీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, వెజిటేబుల్ బిరియాని, వారానికి కోడి గుడ్లు పెట్టాలని నిర్ణయించింది. అందుకు బడ్జెట్ కేటాయించకుండా ఈ కొత్త మెనూ పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కొత్త మెనూకి బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కటారి రాములు, కళావతి, మధ్యాహ్న భోజన పథకం నాయకులు సురేందర్ రెడ్డి, పర్వవ్వ, శేఖర్, హరి శంకర్, నాగలక్ష్మి, సుమలత, భూలక్ష్మి, మహమూధ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love