ముప్పు తప్పదు

The threat is inevitableకంటి నిండా నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అయితే ఈ బిజీ లైఫ్‌.. స్మార్ట్‌ఫోన్‌ యుగంలో నిద్ర క్రమేణా ఐదు నుంచి ఆరు గంటలకు తగ్గిపోతోంది. ఈ అంశంపై పరిశోధకుల అధ్యయనంలో కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. అవేంటంటే…

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న టైప్‌-2 డయబెటీస్‌ నిద్రలేమి వల్ల ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది. కొన్ని ఆర్టికల్స్‌ పరిశీలించిన నిర్వహించిన రివ్యూలో మెండెలియన్‌ రాండమైజేషన్‌ (ఎంఆర్‌) విధానంలో 97 రకాల రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ను తెలుసుకున్నారట.
పగటి వేళ్లలో నిద్రపోవడం, బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోవడం, కోడి నిద్ర, యురినరీ సోడియం లెవెల్స్‌, అమీనో యాసిడ్స్‌ తదితర కారణాలు టైప్‌-2 డయబెటీస్‌కు దారి తీయొచ్చని విశ్లేషించారు. ఈ పరిశోధనలో భాగంగా 34 అంశాలను కనుగొన్నారు. వీటిలో 19 రిస్క్‌ ఫ్యాక్టర్స్‌, 15 ప్రొటెక్టీవ్‌ ఫ్యాక్టర్స్‌లను తెలుసుకున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారిలో టైప్‌-2 డయబెటీస్‌ వచ్చే అవకాశాలు 17 శాతం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. డయబెటీస్‌ ముప్పు దరిచేరకూడదంటే.. కంటి నిండా నిద్ర, బరువును అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అందుకే ఇకనైనా స్మార్ట్‌ఫోన్‌.. టీవీలు చూస్తూ విలువైన నిద్రను చెడగొట్టుకోకుండా హాయిగా నిద్రించి ఆరోగ్యంగా ఉండండి.

Spread the love