అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంపైర్

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: ఎంతోమంది అంపైర్లు వస్తూ పోతూ ఉంటారు. కానీ కొంతమంది మంది తమ అంపైరింగ్ తో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటారు.అందులో ప్రధాన వరుసలో నిలిచేది సౌత్ ఆఫ్రికాకు చెందిన మరైస్ ఎరాస్మస్.అయితే వెటరన్ అంపైర్ మరైస్ ఎరాస్మస్ అంపైరింగ్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపారు. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్ తనకు చివరిదని ప్రకటించారు. ఇంటర్నేషనల్ క్రికెట్ అంపైరింగ్‌లో ఎరాస్మస్ ప్రయాణం గొప్పగా సాగింది.కాగా ఎరాస్మస్ 18 ఏళ్ల క్రితం అంపైరింగ్లోకి ప్రవేశించారు. ఫిబ్రవరి 2006లో వాండరర్స్‌లో సౌత్ ఆఫ్రికా , ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టీ20 ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు.దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అంపైరింగ్ చేశాడు. ఎన్నో మెగా టోర్నీలకు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 43 టీ20, 115 వన్డేలు, 78 టెస్టులకు ఆయన అంపైర్ గా విధులు చేపట్టారు. 2021లో ‘ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచారు.

Spread the love