ఎదురులేని వెర్‌స్టాపెన్‌

ఎదురులేని వెర్‌స్టాపెన్‌– బ్రెజిల్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ వశం
సావోపాలో : రెడ్‌బుల్‌ డ్రైవర్‌, మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. సావోపాలోలో బ్రెజిలియన్‌ గ్రాండ్‌ ప్రీ చాంపియన్‌గా నిలిచిన మాక్స్‌ వెర్‌స్టాపెన్‌.. ఫార్ములా వన్‌ సీజన్‌లో ఏకంగా 17వ టైటిల్‌తో అదరగొట్టాడు. 1.56.48.894 సెకండ్లలో రేసు ముగించిన మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 25 పాయింట్లు సొంతం చేసుకున్నాడు. మెక్‌లారెన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌ రెండో స్థానంలో నిలిచాడు. 19 పాయింట్లు సాధించిన నోరిస్‌.. వేగవంతమైన ల్యాప్‌తో బోనస్‌ పాయింట్‌ను సైతం దక్కించుకున్నాడు.

Spread the love