జర్నలిస్టుల అరెస్టులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన

UNOనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి, జర్నలిస్టుల నిర్బంధంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషనర్‌ కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ”ఢిల్లీలోని జర్నలిస్టులపై దాడులు, అరెస్టులు, నిర్బంధాలు, ఆస్తుల జప్తు నివేదికలతో తమ కార్యాలయం ఆందోళన చెందుతోందని తెలిపింది.పత్రికా స్వేచ్ఛకు సంబంధించి తదేశంలో జరుగుతున్న అశుభ పరిణామాలపై స్పందిస్తూ, జర్నలిస్టుల భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, వారికి బహిరంగ చర్చ, భావ ప్రకటనకు అవకాశం కల్పించాలని తెలిపింది. జర్నలిస్టులపై దారుణమైన దాడి జరిగినట్లు కని పిస్తోంది. న్యూస్‌క్లిక్‌ ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ అమిత్‌ చక్రవర్తి, ఉగ్రవాద నిరోధక చట్టం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద నిర్బంధించబడ్డారని తెలిపింది. న్యూస్‌క్లిక్‌లో పని చేస్తున్న అనేక మంది జర్నలిస్టులను నిర్బంధించడం ప్రజాస్వామ్య విలువలను స్వీకరించే దేశాలలో దిగ్భ్రాంతిని కలిగించిందని జెనీవాలోని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనర్‌ మీడియా విశ్లేషకుడు తెలిపారు. ”ఈ సమయంలో పోలీసులు డజన్ల కొద్దీ జర్న లిస్టుల ఎలక్ట్రానిక్‌ పరికరాలను, ల్యాప్‌టాప్‌లు, టెలిఫోన్‌ లను స్వాధీనం చేసుకోవడం భారతదేశంలో సర్వ సాధారణంగా అనిపించింది. పైగా, జర్నలిస్టులను టెర్రరిస్టు లుగా పరిగణించడం వంటి ఆరోపించిన క్రూరమైన యూఏపీఏ కింద వారిపై అభియోగాలు మోపడం. ”ప్రజా స్వామ్య తల్లి” అని గర్వించుకునే భారతదేశానికి శ్రేయస్కరం కాదు” అని విశ్లేషకులు అన్నారు.మానవ హక్కుల కమీషనర్‌ కార్యాలయంలోని ప్రతినిధి స్పందిస్తూ ”భారతదేశంలో ప్రత్యేకించి స్వతంత్ర జర్నలిస్టులు, కార్యకర్తల కోసం స్పేస్‌ కుదించబడటం గురించి మేము గతంలో ఆందోళన వ్యక్తం చేసాము. గత రెండు రోజులుగా జరిగిన సంఘటనలు మరింత ఊతమిచ్చాయి” అని అన్నారు. ”మరింత కలవర పెట్టే విషయం ఏమిటంటే, టార్గెట్‌కు గురైన వారిలో న్యూస్‌ క్లిక్‌తో సంబంధం ఉన్న రచయితలు, జర్నలిస్టులు, వ్యంగ్య వాదులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. మొత్తం మీద, దాడిలో భాగంగా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం 40 మందికి పైగా వ్యక్తులను విచారించింది” అని తెలిపారు. గత పదేళ్లలో, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక ర్యాంకింగ్స్‌లో భారతదేశం 161వ స్థానానికి పడిపోయింది. అంచనా వేయబడిన 180 దేశాలలో దిగువ ఇరవైలో ఉంది.

Spread the love