అనాధ వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించిన గ్రామస్తులు 

నవతెలంగాణ – హాలియా

అనుముల మండలం పేరూరులో మరణించిన మోహన్ రావు అనాధకు గ్రామస్తులు మంగళవారం దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. పేరూరులో 30 సంవత్సరాలు గా ఉంటున్న మోహన్ రావు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఇంటింటికి తిరిగి అన్నము డబ్బులు అడుక్కు తినేవాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ప్రజలతో అవినాభావ సంబంధంగా ఊట్లో వారిని వరుసలు పెట్టి అమ్మా నాన్న అన్నా వదిన అక్క బావ తమ్ముడు చెల్లి అని ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామంలో ఆత్మీయత పొందాడు. మోహన్ రావుకు ఆస్తిపాస్తులు లేవు. ఎక్కడి నుంచి వచ్చాడో 30 సంవత్సరాల నుండి ఇక్కడే జీవనం కొనసాగిస్తూ గ్రామ ప్రజలతో కలియ తిరుగుతూ ప్రేమ అనురాగాలను సంపాదించాడు. మోహన్ రావుకు ఎటువంటి దురలవాట్లు లేవు సాదాసీదా జీవనం గడుపుతూ అందరితో కలిసి తిరిగేవాడు. అవసరం ఉంటే పైసలు అడుక్కునే వాడు. అటువంటి మోహన్ రావు సోమవారం మరణించడంతో గ్రామస్తులు అందరూ కలిసి మంగళ వారం ఘనంగా అంత్యక్రియలు జరిపామని తెలిపారు.
Spread the love