కమ్యూనిస్టుల భవిష్యత్ కాలమంతా పోరాటాల కాలమే..!

– సత్తుపల్లి సీపీఐ(ఎం) శ్రేణులు.
– అధికార, ప్రతిపక్ష  ఎవరు అధికారం లోకొచ్చిన ప్రజలకు ఒరిగేదేమీలేదు.
నవతెలంగాణ- సత్తుపల్లి రూరల్: కమ్యూనిస్టుల భవిష్యత్ కాలమంతా, పోరాటాల కాలమే నని, అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరు అధికారం లోకి వచ్చిన ప్రజలకు ఒరుగేదేమిలేదని, రాష్ట్ర అభివృద్ధి ని కుంటి పరిచే లక్షణాలే స్పష్టంగా కనిపిస్తున్నాయని సత్తుపల్లి  సీపీఐ(ఎం) శ్రేణులు తేల్చి చెప్పారు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కష్ట జీవులు పక్షాన నిలబడేది కమ్యూనిస్టులే నని ముఖ్యంగా సీపీఐ(ఎం) నే నన్నారు. ఈ నెల 30 వ తేదిన జరగబోయే ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు రెండు గెలుపే ఏకైక లక్ష్యం గా చేసుకోని, ఒకరు నాలుగు వేళ్ళు చూపిస్తే మరొకరు ఐదు వేళ్ళు చూపిస్తూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ, మాయమాటలతో ప్రజల ఓట్లు లాగేసుకొనే పనిలో పడ్డారన్నారు. అందుకే ఒకరికి మించి, మరొకరు పోటీ పడి సంక్షేమ పథకాలతో, ఓటరలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారు. రేపు అధికారం లోకి ఎవరు వచ్చిన  ప్రజలకు మాత్రం కష్టాలు తప్పవన్నారు. అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేయలేక, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళ్లాలేక సతికిలా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నారు. రాబోయే ఐదేళ్లు కమ్యూనిస్టులకు, కష్ట జీవుల పక్షాన నిలసి పోరాటాలు  చేయక తప్పదన్నారు. అందుకు కమ్యూనిస్ట్ శ్రేణులు, ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపు ని వ్వడమే తరువాయి భాగం అన్నారు. బడుగు బలహీన వర్గాల, సన్నాచ్చిన్నకారు రైతులు, కార్మికుల, వ్యవసాయ కూలీల, ఉపాధి, అసంగటిత కార్మికుల తదితరుల  పక్షాన నిలబడి అధికారం లోని ప్రభుత్వాన్ని ముక్కుపిండి సంక్షేమ పథకాలు అమలు చేసే సత్తా ఒక్క ఎర్రజెండా కే ఉందన్నారు. కష్ట జీవుల హక్కుల సాధన కోసం అండగా వుండే  కమ్యూనిస్టుల అవసరం ఎంతుందో ప్రజలు గుర్తించాలన్నారు. గత కొన్ని దపాలుగా చట్ట సభల్లో  కమ్యూనిస్టుల ప్రశంచే గొంతు లేక అధికార ప్రభుత్వాలు ఒంటెద్దు పోకడలు ప్రజలు  గుర్తించాలన్నారు. తమ ఓటు అనే ఆయుధం తో కమ్యూనిస్టులను ఈ సరన్నా చట్ట సభలకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ నేపథ్యంలో నే, గత 40 సంవత్సరాలు గా విద్యార్థి దశనుంచే ప్రజా పోరాటా లు చేసి, ప్రజల నాయమైన హక్కుల సాధన కోసం పలుమార్లు పోలీస్ నిర్భందాలు, కేసులను ఎదుర్కొన్న సత్తుపల్లి సీపీఐ(ఎం) అభ్యర్థి మాచర్ల భారతి ఎన్నికల గుర్తు సుత్తికొడవలి నక్షత్రం గుర్తని, ఆ గుర్తు పై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని, సత్తుపల్లి సీపీఐ(ఎం)   శ్రేణులు శనివారం ఒక ప్రకటనలో కోరారు.
Spread the love