Tuesday, July 7, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్కాడెద్దుగా మారిన తమ్ముడు

కాడెద్దుగా మారిన తమ్ముడు

- Advertisement -

నవతెలంగాణ-బయ్యారం;- ‘మూడ్రోజుల కిందట విద్యుద్ఘాతంతో రెండు కాడెద్దులు, ఆవు దూడె, మేక మృత్యువాతపడ్డాయి. మిగిలిన ఒక్క కాడెద్దుతో నాగలి దున్నడం వీలు కాలేదు. మరోటి కొనడానికి డబ్బుల్లేవ్‌.. దిక్కు తోచని స్థితిలో తమ్ముడే కాడెద్దుగా మారి వ్యవసాయ పనులు చేశారు’. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పెనుక పాపారావు, పెనుక ప్రవీణ్‌ అన్నదమ్ములు. కాగా, విద్యుద్ఘాతంతో వారి పశువులు మృత్యువాత పడ్డాయి. ఒక కాడెద్దు మాత్రమే ఉంది. వ్యవసాయ సీజన్‌లో పనులు చేసేందుకు మరో ఎద్దు కావాలి. కానీ అందుకు డబ్బుల్లేవు. దీంతో ప్రవీణ్‌ కాడెద్దుగా ముందుకు సాగగా.. వెనుక అన్న పాపారావు నాగలి పట్టుకున్నాడు. ట్రాక్టర్‌తో దున్నించే ఆర్థిక పరిస్థితి తమకు లేదని, మరో ఎద్దు కొనే స్థోమత లేక ఇలా ఇబ్బందులు పడుతూ వ్యవసాయం చేస్తున్నట్టు బాధితులు తెలిపారు.

ఇస్లావత్‌ నరేష్‌, బయ్యారం విలేకరి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -