Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాపాడుకుంటేనే..ప్రయోజనం

కాపాడుకుంటేనే..ప్రయోజనం

- Advertisement -

-కేడీసీసీ బ్యాంకు ప్రారంభంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి
-రైతులకు సహాయకారిగా కేడీసీసీ అంటూ ప్రశంసలు
-పీఏసీఎస్ చైర్మన్ కృషి అభినందనీయమని కితాబు
నవతెలంగాణ-బెజ్జంకి

ఖాతాదారులు బ్యాంకులను కాపాడుకుంటేనే.. ప్రయోజనముంటుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన కేడీసీసీ బ్యాంకు భవనాన్ని ఆయన సర్పంచ్ బోల్లం శ్రీధర్, ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ, పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మారతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకులు సేవలందించాల్సిన సమయమని, సకల హంగులతో కేడీసీసీ స్వంత భవనాన్ని నిర్మించుకుని ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. పీఏసీఎస్,కేడీసీసీ స్వంత భవనాల నిర్మాణాలకు పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు శరత్ రావు కృషి ప్రశంసనీయమని కితాబిచ్చారు. అంతకుముందు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, ముత్తన్నపేట గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఎంపీడీఓ కార్యాలయంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేశారు. కేడీసీసీ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ రావు, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ ప్రవీన్, ఉప సర్పంచ్ దుమాల మహేశ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్, లింగాల శ్రీనివాస్, పీఏసీఎస్ సీఈఓ శ్రీనివాస్, సిబ్బంది, అయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

పరామర్శ..
మండల కేంద్రానికి చెందిన జంగిటి రాజయ్య ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -