నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత ఆఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనతో పాటు 9మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
తెలుగు అమ్మాయి కీర్తన..
శివకాశి నుంచి ఎమ్మెల్యేగా కీర్తన గెలుపొందిన తెలుగు అమ్మాయి కీర్తన మంత్రిగా ప్రమాణం చేశారు. విజయ్ కేబినెట్‌లో ఏకైక మహిళా ప్రతినిధి కాగా, మహిళా సాధికారత లక్ష్యంగా కీర్తనకు ప్రాధాన్యత ఇచ్చారు
ఎన్ ఆనంద్..
మంత్రిగా ప్రమాణం చేసిన ఎన్ ఆనంద్.. టి.నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఈయన విజయ్‌కి అత్యంత నమ్మకస్తుడిగా పేరొంది. విజయ్ పార్టీ నిర్మాణంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు.
అదవ్ అర్జున..
విల్లివాక్కం నుంచి గెలిచిన అదవ్ అర్జునకు గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ విధానాల రూపకల్పనలో అదవ్ అర్జున కీలక పాత్ర పోషించారు
కేఏ సెంగొట్టియన్..
గోబిచెట్టిపాళయం నుంచి గెలిపిన కేఏ సెంగొట్టియన్.. ఈయన సీనియర్ రాజకీయ వేత్త. అన్నాడీఎంకే ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. విజయ్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలవనున్నారు.
నిర్మల్ కుమార్..
తిరుప్పరంకుండ్రం నుంచి గెలిచిన నిర్మల్ కుమార్.. ఐటీ, సోషల్ మీడియా రంగంలో పట్టున్న నేతగా పేరొంది. గతంలో బీజేపీ ఐటీ వింగ్‌లో నిర్మల్‌కుమార్ కీలక బాధ్యతలు చేపట్టారు
కేజీ అరుణరాజ్..
తిరుచెంగోడు నుంచి గెలిచిన కేజీ అరుణరాజ్‌కు షెడ్యూల్ కులాల(ఎస్సీ) ప్రతినిధిగా మంత్రివర్గంలో చోటు లభించింది. సామాజిక న్యాయం దిశగా అరుణ్‌రాజ్ అవకాశం లభించింది.
పి.వెంకటరమణన్..
మంత్రిగా ప్రమాణం చేసిన పి.వెంకటరమణన్ మైలాపూర్ నుంచి గెలిచారు. చెన్నై నగర రాజకీయాల్లో ఆయన చురుకైన నేతగా గుర్తింపు పొందారు
ఎ.రాజమోహన్..
ఎ.రాజమోహన్ ఎగ్మోర్ నుంచి గెలిచారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజమోహన్ గుర్తింపుపొందారు
టీకే ప్రభు..
మంత్రిగా ప్రమాణం చేసిన టీకే ప్రభు.. కారైకుడి నుంచి గెలిచారు పార్టీ బలోపేతంలో క్రీయశీలకంగా పనిచేశారు.



