Thursday, June 25, 2026
E-PAPER
HomeNewsమహిళా మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్ళిన దొంగ

మహిళా మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్ళిన దొంగ

- Advertisement -
  • బాధితురాలి అరుపుతో మేల్కొని వెంబడించి పట్టుకున్న స్థానికులు

నవతెలంగాణ-కంఠేశ్వర్: నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్ ఎఫ్సీఐ కాలనీలో మహిళా మెడలోంచి ఐదున్నర తులాల బంగారు గొలుసు లాక్కెల్లాడు ఓ దొంగ. దీంతో బాధితురాలు అరవడంతో మేల్కొన్న స్థానికులు వెంబడించి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ సంఘటన ఎఫ్సిఐ కాలనీలో గురువారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎఫ్సీఐ కాలనీకి చెందిన కొట్టే నాగమణి(65) తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి ఆవరణలోకి వచ్చింది. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న దొంగలు ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు తో పాటు, నల్లపూసల దండ, గుండ్లు తెంపుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే దొంగను ప్రతిఘటించి పట్టుకునేందుకు నాగమణి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దొంగ తప్పించుకొని, గోడ దూకి పారిపోయాడు. వెంటనే బాధితురాలు గట్టిగా అరవడంతో స్థానికులు మేల్కొని గోడ దూకి పారిపోతున్న దొంగను వెంబడించి పట్టుకున్నట్లు తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి దొంగను అప్పగించినట్లు సమాచారం. పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగ ను విచారిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -