Sunday, June 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆ వార్తలు అవాస్తవం: ఇరాన్ విదేశాంగ మంత్రి

ఆ వార్తలు అవాస్తవం: ఇరాన్ విదేశాంగ మంత్రి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాస్తవంలో జీవించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ విమర్శించారు. తమ దేశ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ల మధ్య సమావేశం జరిగే అవకాశం లేదని, ఆ వార్తలు అవాస్తవమని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఒక సమావేశానికి సిద్ధంగా ఉన్నారని, సమావేశం నిర్వహించాలనుకుంటున్నారని చెప్పినట్లు ఒక నివేదికలో చూశానని అన్నారు. ట్రంప్ వాస్తవికంగా ఉండి, నిజ ప్రపంచంలో ఆలోచించి జీవించాలని సూచించారు. అణ్వాయుధాల తయారీని నిలిపివేయడానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీతో సమావేశం అయ్యే అవకాశం ఉందని కూడా ట్రంప్ సూచించారు. ఈ వ్యాఖ్యలను అరాగ్చీ ఖండించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -