Sunday, June 7, 2026
E-PAPER
Homeజాతీయంవిశ్వగురువుగా గొప్పలు..పేద‌ల‌పై ధ‌ర‌ల మోత‌: TMC

విశ్వగురువుగా గొప్పలు..పేద‌ల‌పై ధ‌ర‌ల మోత‌: TMC

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: గృహ వినియోగాదారుల గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను కేంద్రం పెంచిన విష‌యం తెలిసిందే. దేశీయ ఎల్‌పీజీ (LPG) ధరల తాజా పెంపుపై పీఎం మోడీ ప్ర‌భుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యంగ్యాస్త్రాలు సంధించింది. విశ్వగురువుగా చెప్పుకునే ప్రభుత్వం తన పౌరులను ధరల భారం నుండి రక్షించలేకపోతోందని ఆదివారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిగా TMC విమర్శలు గుప్పించింది. ధరల పెరుగుదల భారాన్ని సామాన్య కుటుంబాలపై మోపుతున్నారని, అదే సమయంలో ధనికులపై దీని ప్రభావం ఏమాత్రం పడటం లేదని ఆదివారం సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పేర్కొంది.

“విశ్వగురువుగా చెప్పుకునే ప్రభుత్వం తన పౌరులను ధరల భారం నుండి రక్షించలేకపోతోందని TMC పేర్కొంది. సంపన్నులకు ఈ ధరల పెంపు స్వ‌ల్ప‌మే కావచ్చు, కానీ ఇప్పటికే పెరుగుతున్న గృహ ఖర్చులతో సతమతమవుతున్న కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇదే బీజేపీ విధానం: ప్రపంచ సంక్షోభాలు తలెత్తినప్పుడు పేదలు ఆందోళన చెందుతుంటే, ‘విశ్వగురువు’గా గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, ధరల భారం నుండి దేశ ప్ర‌జ‌ల‌ను రక్షించలేకపోతోంది,” అని TMC రాసుకొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -