విద్యార్థిని మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి

– ఎవైయు సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు కేసారపు సురేందర్
నవతెలంగాణ – మల్హర్ రావు
సూర్యాపేట మండలంలోని ఇమాంపేట సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి ఉరి వేసుకొని మృతి చెందిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని, ఏవైయు (అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ) యువత భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు కేసారపు సురేందర్ ప్రభుత్వాన్ని మంగళవారం ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు బాలిక మృతికి కారుకులైన హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ చేస్తూ, దోషులు ఎంతటివారైనా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని కోరారు.శనివారం రాత్రి జరిగిన ఫెయిర్ వెల్ పార్టీలో పాల్గొన్న విద్యార్థిని, తెల్లవారే సరికి ఆత్మహత్య చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.విద్యార్థిని మృతి పై పలు అనుమానాలు ఉన్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని, వెంటనే ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టళ్లలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని,స్థానికంగా హాస్టల్ వార్డెన్ లు ఉండకపోవడం, నిర్వహణ లోపం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నట్లుగా ఆయన వివరించారు. ఈ ఘటనకు సంబందించిన వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకొని, హాస్టల్ విద్యార్థిని, విద్యార్థులకు  రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Spread the love