భారత స్టార్ షూటర్ ఇషా సింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : పట్టుదల, ఏకాగ్రత, క్రమశిక్షణ విజయానికి బలమైన పునాది వేస్తాయని భారత స్టార్ షూటర్ ఇషా సింగ్ తెలిపింది. ఇటీవల మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డుతో పసిడి పతకం సాధించిన సందర్భంగా లైఫ్‌స్పాన్ సంస్థ ఇషా సింగ్‌ను ఘనంగా సత్కరించింది. ‘విజయానికి షార్ట్‌కట్స్ లేవు. పట్టుదల, అంకితభావంతో ముందుకుసాగాలి. ఇప్పుడు నా ఫోకస్ ఆసియా క్రీడలపైనే ఉంది. ఆసియా క్రీడల్లో బంగారు పతకం తీసుకొస్తాననే నమ్మకముందని’ ఇషా సింగ్ తెలిపింది. కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోనీబాలా దేవి, లైఫ్‌స్పాన్ ఎండీ నరేంద్ర రామ్ తదితరులు పాల్గొన్నారు.
ఆ మూడు విజయానికి పునాది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



