Sunday, May 3, 2026
E-PAPER
Homeజాతీయంసామాన్యుడిపై పిడుగు

సామాన్యుడిపై పిడుగు

- Advertisement -


ధరలు పెంచే యోచనలో ఎఫ్‌ఎంసీజీలు
ముంబయి :
అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో సృష్టించిన యుద్ధంతో సగటు భారతీయుడిపై ధరల భారం పడనుంది. ఇరాన్-అమెరికా ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు, పామాయిల్ ధరలు పెరగడంతో.. ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేసేందుకు ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు సిద్ధమవుతున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌‌యూఎల్‌) ఇటీవల సంకేతాలిచ్చింది. 2025 మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాల పరంగా మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ, మున్ముందు పరిస్థితులు ఆశాజనకంగా లేవని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూల తయారీలో వాడే పామాయిల్, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు యుద్ధం కారణంగా ఒక్కసారిగా పెరిగాయి. ఈ వ్యయాలను తట్టుకోవడానికి ఉత్పత్తుల ధరలను 2 నుండి 5 శాతం వరకు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
బరువు తగ్గుతుంది..!
నేరుగా ధరలు పెంచితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఉత్పత్తులకు దూరమవుతారనే ఆందోళనతో కంపెనీలు శ్రింక్‌ఫ్లేషన్ అనే ఎత్తుగడను అనుసరించనున్నాయి. దీని ప్రకారం.. రూ.5 లేదా రూ.10 ప్యాకెట్ల ధరను మార్చకుండా అందులో ఉండే సరుకు పరిమాణాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల వినియోగదారుడికి ధర మారలేదని అనిపించినప్పటికీ, వాస్తవానికి తక్కువ సరుకుకు ఎక్కువ ధర చెల్లించినట్లవుతుంది. ప్రస్తుతం పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే డిమాండ్ నిలకడగా ఉంది. అయితే ధరల పెంపు నిర్ణయం ఈ డిమాండ్‌ను దెబ్బతీస్తుందా అన్నది వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -