రాబోయే రోజులు గడ్డుకాలమే
కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలోని ఇరాన్-అమెరికాలోని యుద్ద ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం మూడు నెలల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27 అంచనాలను ఈ యుద్ధం పూర్తిగా తలకిందులు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన చమురు ధరలు, ఎరువుల ముడిపదార్థాల కొరత కారణంగా ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రాబోయే త్రైమాసికాలు దేశానికి అత్యంత పరీక్షా సమయమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్‌పెండేచర్ కార్యదర్శి వి. వుల్నామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎరువుల సబ్సిడీ గుదిబండ..
యుద్ధం కారణంగా దిగుమతి వ్యయం పెరగడంతో ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల కంటే అదనంగా మరో రూ.50,000 కోట్లు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఒకవైపు ఆదాయ వనరులు తగ్గుతున్న తరుణంలో ఇంత భారీ మొత్తంలో సబ్సిడీలు పెరగడం ఆర్థిక స్థిరత్వానికి సవాలుగా మారింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను ==నియంత్రించేందుకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఆదాయం పడిపోవడం రెట్టింపు దెబ్బగా పరిణమించిందదన్నారు.
ఆదాయంపై నీలి నీడలు..
గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఆర్థిక అనుకూల పవనాలు ముగిశాయని మంత్రిత్వ శాఖ సంకేతాలిచ్చింది. ఆర్థిక వృద్ధికి అనుగుణంగా పన్ను వసూళ్లు జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో ఆటంకాలు, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం వల్ల పారిశ్రామిక వృద్ధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మౌలిక వ్యయంపైనే దృష్టి..
సబ్సిడీల భారం పెరిగినప్పటికీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన నిధులను తగ్గించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అయితే యుద్ధం కారణంగా నెలకొన్న అనిశ్చితి వల్ల ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. “రేపు ఏం జరుగుతుందో, వచ్చే కొన్ని గంటల్లో పరిస్థితి ఎలా మారుతుందో ఊహించడం అసాధ్యం” అని వుల్నామ్ పేర్కొనడం ప్రస్తుత తీవ్రతకు అద్దం పడుతోంది.
భారత బడ్జెట్‌కు యుద్ధ గండం
- Advertisement -
- Advertisement -



