నవతెలంగాణ – మోపాల్
మోపాల్ మండల కేంద్రంలో కల ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ ఎన్నికను శుక్రవారం రోజున నిర్వహించడం జరిగింది. ఎన్నికకు ఒకే ఒక నామినేషన్ రావడంతో సిర్పూర్ గ్రామానికి చెందిన డైరెక్టర్ తిరుపతిని ఏకగ్రీవంగా వైస్ చైర్మన్ గా ఎన్నికల అధికారి పోషన్న ప్రకటించడం జరిగింది .ఈ ఎన్నికకు తొమ్మిది మంది డైరెక్టర్లు మద్దతు తెలిపారు. నలుగురు డైరెక్టర్లు గైర్హాజరవటం జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ తిరుపతి మాట్లాడుతూ నా ఎన్నికకు కీలక పాత్ర పోషించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మరియు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగా రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సహకార సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి, మోపాల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సతీష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సీఈఓ సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.