నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మంగళవారం 8మంది నేతలపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జావేద్ అహ్మద్ ఖాన్, ఫిర్హాద్ హకీమ్, అరూప్ రాయ్, రథిన్ ఘోష్, విప్లవ్ మిత్రా, సబీనా యాస్మిన్, అరూప్ బిస్వాస్, స్నేహసిన్ చక్రవర్తిలపై వేటు వేసింది. మంగళవారం ఉదయం వారికి షో-కాజ్ నోటీసులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం సోమవారం అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ కమిటీకి కొత్త నాయకత్వాన్ని ప్రకటించి, అరూప్ రాయ్‌ను చైర్‌పర్సన్‌గా నియమించినట్లు వెల్లడించిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. అరూప్ రాయ్ ‘ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్’ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రిటబ్రత బెనర్జీ తెలిపారు. అలాగే, మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్, ఎమ్మెల్యే ఫిర్హాద్ హకీమ్‌లను వైస్-చైర్‌పర్సన్లుగా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. 30 మంది సభ్యులతో క జాతీయ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కమిటీలో ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలు ఉన్నారని అన్నారు. ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్, రథిన్ ఘోష్, బీనా యాస్మిన్‌లను ఉపాధ్యక్షులుగా నియమించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని రిటబ్రత బెనర్జీ చెప్పారు. టిఎంసిలో మమతా బెనర్జీ పాత్రకు సంబంధించి తమ వైఖరిని స్పష్టం చేశామని, ఆమె మార్గదర్శిగా బాధ్యతలు స్వీకరించి, దిశానిర్దేశం చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.



