తల్లికి సాయంగా.. బతుకు భారంగా

As a help to the mother.. as a burden to life– నాలుగేళ్ల క్రితం ప్రమాదవశాత్తు తండ్రి మృతి
– ఆరోగ్యంతో తల్లి 
– కష్టపడుతున్న అక్కా చెల్లెలు 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
చేతుల్లో పుస్తకాలు పట్టుకొని చదువులో నిమగ్నం కావాల్సిన ఆ అక్కాచెల్లెళ్ళు అవే చేతుల్లో పార పట్టి ధాన్యం కుప్పలు లాగుతున్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ప్రమాదవశాత్తు చనిపోవడం.. దానికితోడు తల్లి అనారోగ్యానికి గురి కావడంతో మండలంలోని బద్దెనపల్లీ గ్రామానికి చెందిన అక్కా చెల్లెళ్ళు వరి ధాన్యం కుప్పలు నూరుస్తున్నారు. అటు చదువుకుంటూనే ఇటు ఇంటికి వచ్చి తల్లికి సాయంగా నిలుస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కొనుగోలు కేంద్రంలో పోసి వారం రోజులు గడిచిన ఇప్పటివరకు కొనుగోలు చేయకపోవడంతో… పండించిన పంటను తేమ ఆర పెట్టేందుకు నిత్యం ఉదయం వరి ధాన్యాన్ని నేర్పి… సాయంత్రం కుప్పనూరుచుతున్నారు విద్యార్థినిలు. వీరి కష్టాన్ని చూసి గ్రామస్తులు కంటే కూతుర్నే కనాలి అంటూ వీరిని అభినందిస్తున్నారు. ప్రభుత్వం ఈ సరస్వతి పుత్రికలకు తంగిన సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love