– పొగాకు పంట పండించడం చాలా కష్టమైనప్పటికీ లాభాలు అధికంగా ఉంటాయి
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలో పొగాకు పంట సాగుకు స్థానిక రైతులు ఆసక్తిని కనబరుస్తున్నారు. పంట సాగుకు రైతులు చాలా కష్టపడ్డప్పటికీ, ఫలితాలు కూడా అలాగే వస్తాయని రైతులు పేర్కొంటున్నారు. గతంలో పొగాకు సాగుకు వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ వారు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారో వాటికి బాండ్ల రూపంలో కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ తో పాటు, టీపీపీ, ఐటీసీ కంపెనీల వారు పొగాకు కొనుగోళ్లకు ముందుకు రావడంతో ఈ పంట సాగుపై రైతన్నలు ఆసక్తినీ చూపుతున్నారు. బోధన్ మండలం హంగారగా, కోపర్గా గ్రామాలతో పాటు రెంజల్ మండలంలోని కందకుర్తి, పేపర్ మిల్, నీలా, బోర్గం గ్రామాలలో రైతన్నలు ఈ పంటను పండిస్తున్నారు. ఈ ఏడాది సుమారు రెంజల్ మండలంలో 2000 ఎకరాల లో ఈ పంటను పండించారు. పొగాకు నారు ఎకరానికి 5000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి నాటుతున్నారు. పొగాకు తయారైన తర్వాత దాన్ని పూలమాలల గుచ్చి కట్టెల సహాయంతో దానికి పొగ చూపిస్తారు. పోగాకు మండే లను తయారుచేసిన తర్వాత పది నుంచి 20 రోజుల వరకు కట్టెలు, శనగ పొట్టు, సోయా, పొగాకు కట్టెలతో పొగ చూపి దానిని నల్లగా అయ్యేవరకు పొగ పెడతారు. వివిధ కంపెనీల అధికారులు వచ్చి నాణ్యమైన పొగాకు ఏ గ్రేట్, మిగతా పొగాకులకు బి గ్రేడ్ గా నిర్ణయించి కొనుగోలు చేస్తారు. గత సంవత్సరం క్వింటాలకు 11600 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. ప్రతి ఏటా మార్కెట్లో ధరను బట్టి 500 నుంచి 1000 రూపాయల వరకు ధరను పెంచుతూ వారు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి పండించిన పంట మార్కెట్ ధరలను బట్టి విక్రయిస్తూ ఉంటారు. కష్టపడి పండించిన రైతులకు ఎలాంటి నష్టం రాదని, కష్టపడితే ఫలితం కూడా అలాగే వస్తుందన్నారు.
నీల సింగిల్ విండో చైర్మన్, ఇమామ్ బేగ్.( రైతు కందకుర్తి) పొగాకు పంటను పండించడానికి రైతులు ఎంత కష్టపడితే అంతే లాభాలు కూడా వస్తాయని నీలా సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్ పేర్కొన్నారు. పొగాకు పంట పండించిన తరువాత దానిని పొగాకుగా మార్చడానికి నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. పచ్చగా నున్న పొగాకును నలుపు గా తయారు చేయడానికి సోయపొట్టు, కట్టెలు, మండే చిత్తూరు పాల్తిన్ కవర్లతో