– జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్
నవతెలంగాణ – జుక్కల్
నీటి మొక్కలే వచ్చే తరానికి మహావృక్షాలు అని జుక్కల్ ఎంపిడివో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నాడు మండల కేంద్రంలోని నర్సరీ మరియు మైబాపూర్ గ్రామంలోని ఉపాధి హామీ పథకంలో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఖాళీ స్థలాలు ఉన్నచోట కచ్చితంగా మొక్కలు నాటాలని, ఇది మానవులకు అవసరమని పర్యావరణము కాపాడుకోవాలని తెలిపారు. వృక్షాలు ఎంతో అవసరం అని రైతులకు వర్షాలు సమృద్ధిగా పడాలంటే నేటి మొక్కలు మహ వృక్షాలే కారణమవుతాయని అన్నారు. వర్షాలు పడేందుకు దోహదపడతాయని ఆయన అన్నారు. నర్సరీలోలో మొక్కల పెంపకం త్వరిత గతిన చేయాలని, లేకుంటే శాఖ పరమైన చర్యలు ఉంటాయని అన్నారు. రాబోయే జూన్ మాసంలో మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని, అందువల్లనే మండలంలో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న నర్సరీలలో మొక్కలు ఇచ్చిన టార్గెట్ ప్రకారం పెంపకం చేయాలని సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశించారు.