స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా పాలనాధికారి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డు అందుకున్న పలువురు మండల స్థాయి అధికారులతో పాటు పదవీ కాలం పూర్తి చేసు కున్న మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యుడు, ఎంపీపీతో కలిసి మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వ హించనున్నట్లుగా ఆ సంఘం మండల అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి గోపి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కొంతం శంకరయ్య, ప్రచార కార్యదర్శి దాసరి రాజన్న తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్లో మీియాతో మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించే ఆత్మీయ సమావేశానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడల్ మా బుజ్జి పటేల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నట్లు తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశానికి మున్నూరు కాపు సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.