
నవతెలంగాణ – నెల్లికుదురు
టి పి టి ఎఫ్ నెల్లికుదురు మండల కమిటీని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చుంచు శ్రీశైలం సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టి పి టి ఎఫ్ నెలికుదురు మండల కమిటీ ఎన్నికల అధికారి బలాష్టి రమేష్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడిగా వై యాకయ్య ప్రధాన కార్యదర్శిగా సంఘ శ్రీనివాస్ జిల్లా కౌన్సిలర్ ఏ వెంకటేశ్వర్లు నిక్క తునిస జంపాల రాజుని ఏకగ్రీవంగా ఎన్నికలంటే తెలిపారు అనంతరం వారు మాట్లాడుతు ఇటీవల బదిలీల్లో అనధికారికంగా చేసిన టీచర్ పోస్టుల రేషనలైజేషన్ కారణంగా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడిందని అన్నారు. విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట టీచర్లు లేకపోవడం, టీచర్ల సర్దుబాటుకు కూడా అవకాశం లేకుండా ఉండడం వల్ల బోధనకు ఆటంకం కలుగుతుందని అన్నారు. బోధనావసరాలు తీర్చకుండా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ముఖ్యమంత్రి బాధను వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బందిని నియమించకుండా స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమాన్ని పాఠశాలల్లో ఎలా చేపట్టాలని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు హరీష్, రాజు ,రవి ,మధుబాబు, పద్మావతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.