- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. చంద్రయాన్-2 డాటా ఆధారంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీటి ఆనవాళ్లను, మంచును గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ఆర్బిటార్‌లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ (డీఎఫ్‌ఎస్‌ఏఆర్) సాయంతో ఈ మంచును గుర్తించారు. దక్షిణ ధ్రువంలోని బిలాల అడుగున, అత్యంత శీతలమైన ప్రాంతాల్లో (25 కెల్విన్ లేదా -248 డిగ్రీల సెల్సియస్) బిలియన్ల ఏండ్ల నాటి మంచు ఉన్నట్టు కనుగొన్నారు.
- Advertisement -


