బేటి బచావో బేటి పడావో పై మహిళలకు శిక్షణ

నవతెలంగాణ – మోపాల్

మోపాల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం రోజున ఆడపిల్లల సంరక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భేటీ బచావో బేటి పడావో కార్యక్రమం పై అంగన్వాడీ టీచర్లకు మరియు ఆశ వర్కర్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా శంకు సంక్షేమ అధికారి రసూల్ బి మరియు సిడిపిఓ సౌందర్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిడిపిఓ సౌందర్య మాట్లాడుతూ ముఖ్యంగా ఆడపిల్లల సంరక్షణ భృృణ హత్యలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు అలాగే బాల్య వివహాలను అరికట్టడం తదితర అంశాల పైన అవగాహన కల్పించారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలని, మనోధైర్యం గురించి వారికి వివరించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జాకీరా మహిళా సాధికారిక కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ స్వప్న మరియు సౌమ్య పుష్ప టిహెచ్ వెంకటేశ్వర్లు మెడికల్ ఆఫీసర్ శ్యాంసుందరి తదితరులు పాల్గొన్నారు
Spread the love