ఏఐఎఫ్ డిఎస్ ఆధ్వర్యంలో ఎర్ర గులాబీల నివాళులు

నవతెలంగాణ- కంటేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎరుపాటు చేసిన సంతాప కార్యక్రమంలో ప్రజాకవి గద్దర్ కి నివాళులు అర్పించడం జరిగింది . ఈ సందర్భంగా ఏ ఐ ఎఫ్ డి ఎస్ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ ప్రజాకవి గద్దర్ కి నిజామాబాద్ జిల్లాతో ప్రత్యేక బంధం ఉండేదని తెలంగాణ ఉద్యమం సమయంలో జిల్లా విద్యార్థి నాయకులతోపాటు అనేకమంది ఉధ్యమకారులతో జిల్లా ప్రజానికంతో మమేకమై ధూమ్ ధామ్ కార్యక్రమాలు జిల్లా కేంద్రంగా నిర్వహించి జిల్లా ఉద్యమానికి ఉపిరినిచ్చి యావత్తు జిల్లా ,రాష్ట్ర, దేశ వ్యాప్తంగా కోట్లాది పిడిత ప్రజల గుండె ఘోష ను పోరాట ఉద్యమాలకు ఊపిరిపోసిన ప్రజల బాధలను, రాజ్యహింసను తనమాటలగా పాటల రూపంలో తూటాలుగా పేల్చిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ గద్దర్ తను మరణించిన కూడా తన ఆటపాట మాట పీడితుకులాల పోరుబాటుకు గొంతుకగా యావత్తు ప్రజానీకాన్ని ఉద్యమాల వైపు మళ్లించడంలో తన జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటాయని అన్నారు, అంతే కాకుండా ప్రజాసమస్యలకై ఉద్యమించి పేద , బడుగు, బలహీన, పీడిత, తాడిత జీవితాలు అభివృద్దే గద్దర్ గారికి నిజమైన నివాళులు అని అన్నారు . గద్దర్ స్ఫూర్తితో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగుతూ ప్రజాఉద్యమలకు ప్రజలు ఉద్యమించాలని పిలునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా నాయకులు గోపాల్,  సాయి, గణేష్, నితిన్, అవినాష్, సిద్దిరామ్, శివ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love