Monday, September 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్సిడీతో అందుబాటులో ట్రైకోడెర్మా వీరిడే 

సబ్సిడీతో అందుబాటులో ట్రైకోడెర్మా వీరిడే 

- Advertisement -

– మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని రైతులకు సబ్సిడీలో ట్రైకోడెర్మా వీరిడే  అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ట్రైకోడెర్మా వీరిడే తోపాటు జిప్సం కూడా సబ్సిడీ ధరలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అవసరమున్న రైతులు కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకొని రావాలని సూచించారు. జిప్సం పూర్తి ధర టన్నుకు రూ.5340 ఉండగా సబ్సిడీ మీద రైతుకు కేవలం 534 రూపాయలకే లభిస్తుందని తెలిపారు. ట్రైకోడెర్మా వీరిడే కేజీ ₹100 మాత్రమేనని ప్రకటనలు తెలిపారు. అవసరం ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -