Sunday, September 20, 2026
E-PAPER
Homeజాతీయంత్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి

త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : త్రిపుర డీజీపీ అనురాగ్‌ ధన్‌ఖడ్‌ అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందారు. అగర్తలాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయన గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గమనించిన సిబ్బంది వెంటనే ఆయన్ని అగర్తలాలోని గోవింద్ బల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆయన మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -